కసనగోడ్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు

కసనగోడ్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు

NLG: కేతేపల్లి మండలం కసనగోడ్ గ్రామంలో సోమవారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వివిధ పాటలకు కోలాటాలు వేస్తూ సందడి చేశారు. దీంతో గ్రామమంతా బతుకమ్మ పాటలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో చిన్నా పెద్దా అందరూ పాల్గొని సాంప్రదాయ వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు.