చింతలవలసలో 50 కుటుంబాలు టీడీపీలో చేరిక

W.G: దత్తిరాజేరు మండలంలోని ఎస్. చింతలవలస గ్రామంలో మంగళవారం రాత్రి పతివాడ కృష్ణమూర్తి, ఆల్తి అప్పలనాయుడు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గజపతినగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.