పొదిలిలో CMRF చెక్కుల పంపిణీ
ప్రకాశం: పొదిలి మండలంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి కందుల వసంత లక్ష్మి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6,43,434 CMRF చెక్కులను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. అనంతరం మేలు చేసిన ప్రభుత్వాన్ని మర్చిపోరాదని ఆమె పేర్కొన్నారు.