ప్లాస్టిక్ విక్రయాల నిషేదంపై అవగాహన

ప్లాస్టిక్ విక్రయాల నిషేదంపై అవగాహన

కృష్ణా: గుడివాడ పురపాలక సంఘ పరిధిలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై పూర్తిస్థాయి నిషేధం అమలులో ఉందని కమిషనర్ సింహాద్రి మనోహర్ ప్రకటించారు. ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గురువారం పురపాలక శానిటరీ విభాగం ప్రత్యేక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ అప్పారావు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.