జీడీనెల్లూరు ఇన్‌ఛార్జ్ మార్పు అవాస్తవం: కృపాలక్ష్మి

CTR: వైసీపీ జీడీనెల్లూరు ఇన్‌ఛార్జ్‌ను మారుస్తారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కృపాలక్ష్మి స్పష్టం చేశారు. పుత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి అవాస్తవాలను వైసీపీ నాయకులు ఎవరూ నమ్మవద్దని కోరారు. వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా కృపాలక్ష్మిని తప్పించి కుతూహలమ్మ కుమారుడు ఆనంగి హరికృష్ణను నియమిస్తారని ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.