తండ్రి విజయానికి కూతురు విస్తృత ప్రచారం

విశాఖ: మాడుగుల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి విజయానికి కూతురు మండల కేంద్రం కోటపాడులో మాజీ సర్పంచ్ డి.లక్ష్మీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. తన తండ్రి విజయానికి కృషి చేయాలని, టీడీపీ, బీజేపీలను గెలిపించి అభివృద్ధికి చోటు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ప్రచారానికి మహిళలు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.