సమస్యల పరిష్కారమే ధ్యేయం.. ప్రజల చెంతకు ఎమ్మెల్యే

సమస్యల పరిష్కారమే ధ్యేయం.. ప్రజల చెంతకు ఎమ్మెల్యే

KNR: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మదిలో పుట్టుకొచ్చిన వినూత్న ఆలోచనే ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మే డే సందర్భంగా గురువారం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం వేదిక కానున్నది. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా ప్రజల చెంతకే అధికార బృందం వెళ్లి సమస్యలు తీర్చనున్నారు.