'నాణ్యత ప్రమాణాలు పాటించాలి'

'నాణ్యత ప్రమాణాలు పాటించాలి'

ASR: హుకుంపేట మండలంలోని దాలిగుమ్మడి గ్రామంలో జరుగుతున్న ఎంపీపీ పాఠశాల భవన నిర్మాణ పనులను గురువారం స్థానిక పంచాయతీ సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ, ఎంపీటీసీ సభ్యురాలు కొమ్మా రమ పరిశీలించారు. సమగ్ర శిక్ష అభియాన్ పథకం ద్వారా రూ.13 లక్షల నిధులతో పాఠశాల భవనం మంజూరైందని సర్పంచ్ తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.