అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలి: వైసీపీ
కోనసీమ: రాష్ట్రంలో దళితులను అణచివేసే విధానం అమలు చేస్తున్నారని YSRCP ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్, నియోజకవర్గ కన్వీనర్ నక్క సింహాచలం పేర్కొన్నారు. మండపేట వైసీపీ కార్యాలయంలో శనివారం వారు మాట్లాడుతూ.. నర్సీపట్నంలో స్పీకర్ పదవిలో ఉంటూ చింతకాయల అయ్యన్నపాత్రుడు దళితునిపై పోలీసుల సమక్షంలో బహిరంగంగా చేయి చేసుకున్న ఘటనను తీవ్రంగా ఖండించారు.