'ప్రభుత్వ నిర్ణయాలతో ఆటో కార్మికులకు నష్టం'

VZM: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఆటో కార్మికులకు భారీ నష్టం ఏర్పడుతుందని AITUC విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ విమర్శించారు. సోమవారం గజపతినగరం ఆటో యూనియన్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే ఆటో కార్మికులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నరన్నారు. ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.