కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్

కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్

BHPL: మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్లను నేటి 17 నుంచి 23వ తేదీ వరకు మున్సిపల్ కార్యాలయంలో స్వీకరిస్తామని పేర్కొన్నారు. మొత్తం నాలుగు స్థానాలకు ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఎన్నిక కావాలి. ఇందులో జనరల్ కేటగిరీలో ఒకటి, మైనారిటీలో ఒకటి మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి.