ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
VSP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి ఏప్రిల్ 28న శంకుస్ధాపన చేయనున్నారు. 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో దీన్ని నెలకొల్పనున్నారు. ఈ నెల 28న పనులు అధికారికంగా ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమంలో CM చంద్రబాబు, మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్ పాల్గొంటారు. డేటా సెంటర్‌కు విశాఖ సమీపంలో మూడు చోట్ల 601.4 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.