రేపు మండల స్థాయి క్రీడా పోటీలు

GDWL: కేటీదొడ్డిలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఫిజికల్ డైరెక్టర్లు జీకె రమేశ్, మోహనమురళీలు తెలిపారు. ధరూర్ మండలం ర్యాలంపాడు సమీపంలో ఉన్న కేటీదొడ్డి గురుకుల పాఠశాల ఆవరణలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయని చెప్పారు. మరిన్ని వివరాలకు ఈ 79813 64077, 77022 48183 నంబర్లను సంప్రదించాలని సూచించారు.