VIDEO: భారీ వర్షాలతో మరువపారుతున్న గుత్తి చెరువు

ATP: గుత్తి మండలంలో గత రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నీటితో కలకలలాడుతున్నాయి. శుక్రవారం గుత్తి చెరువులో వరద నీరు భారీగా చేయడంతో చెరువు నిండుకుండలా మారీ మరువ పారుతుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. బెస్తవారు పారుతున్న మరువకు గంగ పూజ చేశారు. ఐదు సంవత్సరాల తర్వాత గుత్తి చెరువు మరువ పారుతుందన్నారు.