'ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'

మన్యం: ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్లో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని కొమరాడ ఎస్సై నీలకంఠం సూచించారు. కొమరాడలో సోమవారం అన్‌లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులకు సెల్‌ఫోన్‌లకు వచ్చే ఓటీపీలు చెప్పవద్దన్నారు. సెల్‌ఫోన్‌లకు పంపించే లింక్‌లను ఓపెన్ చేయడం గాని చేయరాదన్నారు.