కాబూల్‌లో భారీగా పేలుళ్లు

కాబూల్‌లో భారీగా పేలుళ్లు

పాక్, ఆఫ్ఘనిస్తాన్ ఉద్రిక్తతలు రోజురోజుకు ఉద్ధృతంగా మారుతున్నాయి. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌పై పాక్ మరోసారి దాడికి పాల్పడింది.  తమపై దాడులు చేసిన పాక్ విమానాలపై తమ దళాలు అనేక రౌండ్ల కాల్పులు జరిపినట్లు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. దాడుల నేపథ్యంలో ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని సూచించారు. అయితే ఈ దాడిలో ప్రాణనష్టం గురించి ఇరు దేశాలు వెల్లడించలేదు.