VIDEO: లారీని ఢీకొట్టిన RTC బస్సు
KNR: జిల్లాలో RTC బస్సు ప్రమాదానికి గురైంది. KNRలోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద RTC బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వసం కాగా, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. RTC కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.