గణపతి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత

KMM: సంస్కృతి, సంప్రదాయాలు పాటిస్తూ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వినాయక నవరాత్రోత్సవాలు నిర్వహించాలని ఖమ్మం స్తంభాద్రి ఉత్సవ కమిటీ నిర్ణయించింది. కమిటీ అధ్యక్షుడు వినోద్ లాహోటి అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఉత్సవాలపై చర్చించారు. ఈనెల 27న గణేష్ ఉత్సవాలను ప్రారంభించి, సెప్టెంబర్ 6న ప్రతిమలను నిమజ్జనం చేయాలని నిర్ణయించారు.