హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
TG: హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై సంధ్య కన్వెన్షన్ హైకోర్టులో పిటిషన్ వేయగా.. విచారణ సందర్భంగా 'ఎవరి అనుమతితో కూల్చివేతలు చేపట్టారు?' అని హైడ్రాని ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.