ఆకతాయి స్టంట్లు.. హడలెత్తిపోయిన విద్యార్థినులు
ఒక యువకుడు నడిరోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ చేసి స్కూల్ విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన బీహార్‌లోని నలంద జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే విద్యార్థులను భయపెట్టిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.