కాలనీల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటా: ఎమ్మెల్యే

HYD: కాలనీలలోని సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ డివిజన్ సుందర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు వెస్ట్ మారేడ్ పల్లి కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.