'ఒకటి రెండు రోజుల్లో భారత్‌కు ఆసియాకప్ ట్రోఫీ'

'ఒకటి రెండు రోజుల్లో భారత్‌కు ఆసియాకప్ ట్రోఫీ'

ఆసియాకప్ ట్రోఫీపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఆసియాకప్‌ ట్రోఫీ ముంబైలోని బీసీసీఐ కార్యాలయానికి చేరుకునే అవకాశముందని తెలిపింది. నవంబర్ 4న ఐసీసీ త్రైమాసిక సమావేశం జరగనుంది. అప్పటిలోగా ఆసియాకప్ ట్రోఫీ భారత్‌కు చేరకుంటే.. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్తామంటూ బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా హెచ్చరించారు.