అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
MLG: ములుగు మండలం శ్రీనగర్ క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం రెండవ SI చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాహనల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 153 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.