ఆకట్టుకున్న 'రామాయణ' నాటిక
NRPT: నర్వ మండలం కల్వాల ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నాటికలు అలరించాయి. ముఖ్యంగా విద్యార్థులు ప్రదర్శించిన 'రామాయణ' నాటిక ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. చదువుతో పాటు కళల్లోనూ విద్యార్థులు రాణించాలని కోరారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.