కోతుల దాడి... బిల్డింగ్ పై నుంచి దూకిన కార్మికుడు

KNR: కరీంనగర్‌లోని రజ్విన్ చామన్ ప్రాంతంలో కోతుల దాడితో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటిపై అంతస్తులో పనిచేస్తున్న సమయంలో రాజు అనే కార్మికుడిపై కోతులు దాడి చేశాయి. దీంతో వాటి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించగా రాజు భవనం పైనుంచి దూకాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.