'ఎన్నికల్లో ఎలాంటి గొడవలు లేకుండా చూడాలి'
BDK: స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రజలు తప్పనిసరిగా ఎన్నికల మార్గదర్శకాలను పాటించాలని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను విజ్ఞప్తి చేశారు. కొమరారం పీఎస్ పరిధిలోని పోలారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, గ్రూపు తగాదాలు, ర్యాలీలు, అల్లర్లు జరగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.