15 మంది ఉపాధి కూలీలకు గాయాలు

15 మంది ఉపాధి కూలీలకు గాయాలు

MNCL: దండేపల్లి మండల శివారులో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేయడంతో 15 మంది గాయపడ్డారు. ఇవాళ గ్రామ శివారులో కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా హఠాత్తుగా తేనెటీగలు దాడి చేశాయని కూలీలు తెలిపారు. ఈ ఘటనలో 15 మంది కూలీలకు గాయాలు కాగా, వారిలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దండేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని ఎంపీడీఓ ప్రసాద్ తెలిపారు.