కష్టపడి చదివి విజయాలు సాధించాలి: ఎమ్మెల్యే
JGL:సమాజాన్ని మార్చగలిగే శక్తి విద్యకు ఉందని, బాగా చదివి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్లలోని జిల్లా పరిషత్ గర్ల్స్, బాయ్స్ హై స్కూల్‌ను బుధవారం ఆయన సందర్శించారు. చదువు, భవిష్యత్ లక్ష్యాలు, స్కూల్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ అవసరాలకు ఎటువంటి సహాయం కావాలన్నా సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు.