'ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
SRPT: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శుక్రవారం చివ్వెంల మండలం ఉండ్రుగొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు కనీస మద్దతు ధర పొందాలంటే నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పని చేస్తోందన్నారు.