భారీగా రేషన్ బియ్యం పట్టివేత

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

కడప టూ టౌన్ పరిధిలోని మండి బజారులో ఇవాళ పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గుర్తించారు. SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సీఐ ప్రసాదరావు నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో 775 కిలోల (31 బ్యాగుల) పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేశారు.