ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్
KMR: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారు నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. సోమవారం భిక్కనూర్ మండలం అంతంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, ఎమ్మార్వో సునీత, హౌసింగ్ అధికారులు, సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి పాల్గొన్నారు.