సర్పంచ్‌పై దాడి.. నలుగురిపై కేసు నమోదు

సర్పంచ్‌పై దాడి.. నలుగురిపై కేసు నమోదు

KMM: మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు సర్పంచ్‌పై దాడి చేసిన ఘటనపై వైరా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌ఐ పుష్పాల రామారావు వివరాల మేరకు.. వైరా మండలం కొండకోడిమ సర్పంచ్ జర్రిపోతుల వినోద్ గురువారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఆయనపై భౌతికంగా దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.