'కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి'
SDPT: సిద్దిపేట రూరల్ మండలంలోని తోర్నాల గ్రామంలోని బాలుర పోస్టుమేట్రిక్ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా హాస్టల్ వార్డెన్‌కు రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, రుచికరమైన ఆహారం విద్యార్థులకు అందించాలని ఆమె ఆదేశించారు.