విద్వేషపూరిత ప్రసంగం.. ఎమ్మెల్యేకు జైలు శిక్ష

విద్వేషపూరిత ప్రసంగం.. ఎమ్మెల్యేకు జైలు శిక్ష

విద్వేష పూరిత ప్రసంగం కేసులో గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ కుమారుడు, మౌ సదర్ ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు యూపీ కోర్టు తీర్పునిచ్చింది. 2022లో జరిగిన విద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన కేసులో ఆయనకు శిక్ష పడింది. ఈ కేసులో ఆయన సోదరుడు మన్సార్ అన్సారీకి కూడా ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానాను కోర్టు విధించింది.