ఎలుగుబంటి దాడిలో నలుగురికి గాయాలు

SKLM: మందస(M) నారాయణపురంలో శనివారం సమీప తోటల్లో పనులు చేసుకుంటున్న రైతులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, పున్నయ్య, మోహనరావు, సోమయ్యలకు గాయాలయ్యాయి. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మరక్షణకు గ్రామస్థుల ఎలుగుపై ప్రతి దాడి చేయగా మృతి చెందింది. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.