హై లెవల్ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

హై లెవల్ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

KMR: గాంధారి మండల కేంద్రంలోని పొచమ్మ రేవు వద్ద రూ. 4.9 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జ్‌కు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా గంధారివాసులు ఎదురుచూస్తున్న చిరకాల స్వప్నం నేటితో నిజమైందన్నారు. సంవత్సరాల తరబడి సమస్యలు ఎదుర్కొన్న రైతులకు ఈ వంతెన గొప్ప ఉపశమనాన్ని అందిస్తుందని తెలిపారు.