నేడు వాల్మీకేశ్వర స్వామికి అన్నాభిషేకం
TPT: నాగలాపురం మండలం సురుటుపల్లిలోని శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం వాల్మీకేశ్వర స్వామికి అన్నాభిషేకం కార్యక్రమం జరుగుతుందని ఆలయ ఈవో లతా తెలిపారు. సాయంత్రం 5:30 గంటలకు వాల్మీకేశ్వర స్వామిని అన్నంతో అలంకరించి మహా హారతి ఇవ్వనున్నట్లు తెలిపారు. 5:45 గంటలకు స్వామివారికి అన్నాభిషేకం కార్యక్రమం, అలంకరణ చేసి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తారు.