రీ పోలింగ్‌కు రాకుండా పారిపోతున్నారు: MLA

KDP: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో రీ పోలింగ్ అడిగి పోలింగ్‌కు రాకుండా పారిపోతున్నారంటే ప్రజలు మీ వైపు లేరని అర్థమైందా? అని వైసీపీ నేతలను ఏమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. ఇందులో భాగంగా పులివెందుల టీడీపీ కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడారు. వైసీపీ నేతలు కావాలనే కొందరి చేత ఓట్లు వేయలేక పోయామంటూ వీడియోలు తీసి ఎన్నికల కమిషన్‌కు పంపి ఫిర్యాదు చేశారన్నారు.