ఈనెల 15న ఉమ్మడి జిల్లా జోనల్ స్థాయి వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక

MNCL: బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ కాసిపేట బాలుర గురుకుల పాఠశాలలో ఈనెల 15న ఉమ్మడి జిల్లా జోనల్ స్థాయి వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉంటాయని DIEO అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో 19 ఏళ్లలోపు వయస్సు ఉండాలని, ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 97045 88763లో సంప్రదించాలని సూచించారు.