నేడు పట్నం నరేందర్ రెడ్డి పాదయాత్ర

MBNR: దుద్యాల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బుధవారం ఉదయం 9 గంటల నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం నుంచి హకీంపేట్, పులిచెర్లకుంటతండా, రోటిబండతండా లగచర్ల, దుద్యాల వరకు పాదయాత్ర కొనసాగనుందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.