108 అంబులెన్స్‌లో మహిళకు సురక్షిత ప్రసవం

108 అంబులెన్స్‌లో మహిళకు సురక్షిత ప్రసవం

NLG: తిరుమలగిరి సమీపంలో కొంపెల్లి గ్రామానికి చెందిన 22 ఏళ్ల సంధ్యకు పురిటి నొప్పులు రావడంతో భర్త వినోద్ 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. స్పందించిన EMT రాకేష్, పైలట్ గణేష్ మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా తిరుమలగిరి వద్దనే ప్రసవ వేదనలు పెరగడంతో రాకేష్ డాక్టర్ శివ సూచనల మేరకు అంబులెన్స్‌లోనే సురక్షిత ప్రసవం నిర్వహించారు. తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.