'వార్డు సమస్యలు పరిష్కరించాలి'
MDK: తూప్రాన్ పట్టణంలోని ఆరో వార్డులో సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్లు, కరెంటు స్తంభాలు, వాటర్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాచారం ఆలయ ఛైర్మన్ రవీందర్ గుప్తా, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.