హెల్మెట్ అవగాహనపై బైక్ ర్యాలీ
KRNL: రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హెల్మెట్ అవగాహనపై బైక్ ర్యాలీని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రమాదాల నియంత్రణకు కర్నూలు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.