కొండాపురం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కడప జిల్లా కొండాపురం మండలంలో గురువారం రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన బోరు నారాయణరెడ్డి గ్రామం వద్ద బైకుపై రోడ్డు దాటుతుండగా, కడప వైపు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదానికి అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు పేర్కొన్నారు.