ఉమ్మడి జిల్లాస్థాయి నెట్ బాల్ ఎంపిక పోటీలు
KRNL: కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లాస్థాయి సీనియర్ నెట్ బాల్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా నెట్ బాల్ సంఘం సీఈవో నాగరత్నమయ్య శనివారం తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 29 వరకు అమలాపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు.