VIDEO: అపరిశుభ్రంగా మాటూరు పెద్ద వాటర్ ట్యాంక్

VIDEO: అపరిశుభ్రంగా మాటూరు పెద్ద వాటర్ ట్యాంక్

KMM: మధిర మండలం మాటూరు విద్యానగర్ కాలనీలోని పెద్ద వాటర్ ట్యాంక్ అపరిశుభ్రంగా ఉందని స్థానికులు తెలిపారు. గత 6, 7 నెలల నుంచి వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయకపోవడంతో బురద చేరి ఊళ్లో సరఫరా అయ్యే నీరు కలుషితమవుతుందని చెప్పారు. ఈ కలుషితమైన నీటిని తాగితే ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని అన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.