పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్‌పై విచారణ

పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్‌పై విచారణ

KDP: కడప పరిశ్రమల శాఖలో గతంలో డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్‌‌గా పనిచేసిన కె.కృష్ణమూర్తిపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కొప్పర్తి పరిశ్రమల అధ్యక్షుడు జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు.ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించి, ఉషశ్రీని విచారణాధికారిగా నియమిస్తూ GO జారీ చేసింది.