బెల్ట్ షాపు నిర్వాహకుడు అరెస్ట్

అన్నమయ్య: బెల్ట్ షాపు నిర్వాహకుడిని బుధవారం కురబలకోట మండలంలో అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ మహిళా ఎస్సై డార్కస్ తెలిపారు. విజయవాడ టాస్క్ ఫోర్సు సీఐ శ్రీనివాసమూర్తి సిబ్బందితో వచ్చి కురబలకోట మండలం, ముద్దుబేడు బస్ స్టాప్ వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 52బాటిళ్ల ఆంధ్ర మద్యాన్నిరెడ్డప్ప కలిగి ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.