ఉపాధ్యాయునికి జ్ఞాపికను అందజేసిన విద్యార్థులు

ఉపాధ్యాయునికి జ్ఞాపికను అందజేసిన విద్యార్థులు

నెల్లూరు: కొండాపురం మండల పరిధిలోని గరిమెనపెంట హైస్కూల్లో ఆ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు బయాలజీ బోధించే ఉపాధ్యాయులు మాల్యాద్రి పై గురుభక్తిని చాటుకున్నారు. ఇటీవల బదిలీలలో భాగంగా ఆయన వింజమూరు మండలం గుండెమడగల హైస్కూల్ కు బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఉపాధ్యాయుడిని విద్యార్థులు శాలువా పూలమాలతో సత్కరించి ఆయన ముఖ రూపాన్ని పెన్సిల్‌తో డ్రాయింగ్ వేశారు.