కలెక్టర్ ను కలిసిన MGM సూపరింటెండెంట్
WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ డా. సత్య శారదను ఇటీవల MGM ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డా. పి. హరీష్ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రికి సంబంధించిన పలు విషయాల పై చర్చించుకున్నారు. కలెక్టర్ అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, అధికారులు తదితరులు ఉన్నారు.